హీరోల రాహుకేతు పూజలు
సినీ నటులు జగపతిబాబు, జె.డి.చక్రవర్తి, నితిన్ ఆదివారంనాడు శ్రీకాళహస్తి ఆలయంలో రాహు-కేతు పూజలు జరిపారు. కాళహస్తీశ్వరుని దర్శనానికి ముందు వీరు రాహు-కేతు పూజలు చేశారు. అక్కడ జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి వీరు విచ్చేశారు. పలువురు నటులు ఆలయానికి వచ్చినట్టు తెలియడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆటోగ్రాఫ్ ల కోసం పోటీపడ్డారు.
పూజల అనంతరం బయటకు వచ్చిన జగపతిబాబు, జె.డి., నితిన్ లు అభిమానులకు అభివాదం చేశారు. జె.డి.చక్రవర్తి మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమలో క్రియేటివ్ టెక్నీషియ్లకు కొరత లేదన్నారు. కమర్షియల్ విలువలను పాటిస్తూనే ఆడియెన్స్ అభిరుచులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు తీయాల్సి ఉంటుందన్నారు. తన సినిమాల విషయంలో ఎక్కువగా హారర్ కే ప్రాధాన్యమివ్వడం ద్వారా రొమాంటిక్ ఫిలిమ్స్ కు దూరమైన విషయాన్ని జె.డి. ఒప్పుకున్నారు. రామ్ గోపాల్ వర్మతో కలిసి తాను సుమారు 50 సినిమాలు చేశాననీ, అయితే ఎక్కువ సినిమాలు సామాజిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు. ఇక నుంచి లవ్ సబ్లెక్ట్ లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నానని తెలిపారు. వర్మ దర్శకత్వంలో 'అజ్ఞాత్' (అడవి) చిత్రం ద్వారా బాలీవుడ్ కు పరిచయమవుతుండటం సంతోషంగా ఉందని నితిన్ తెలిపారు. ఆసక్తికరంగా వర్మ క్యాంపు లోనే జె.డి., జగపతి, నితిన్ కలిసి త్వరలో ఓ చిత్రానికి పనిచేయబోతున్నట్టు సమాచారం.
Be first to comment on this News / Article!
|