వరుణ్ ప్రారంభించిన 'ర్యాంప్'
పురుషుల కోసం ఎక్స్ క్లూజివ్ దుస్తులను అందించే 'ర్యాంప్ మెన్స్ ఫ్యాషన్ వేర్' బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 2లో సోమవారంనాడు ప్రారంభమైంది. యువ కథానాయకుడు వరుణ్ సందేష్ ఈ షోరూంను ప్రారంభించారు.
ర్యాంప్ ఫ్యాషన్ షోరూమ్ తొలి బ్రాంచ్ ఇదనీ, ఇందులో పురుషులు ధరించే సూట్, కుర్తా, కమీజ్ తో పాటు అన్ని రకాల దుస్తులు అందుబాటు ధరల్లో లభిస్తాయని షోరూం అధినేత కృష్ణమూర్తి తెలిపారు. పరిశ్రమకు చెందిన వారికి కూడా అందుబాటులో ఉండేందుకు బంజారాహిల్స్ లో ఈ షోరూమ్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఇక్కడ దుస్తులు కొనుగోలు చేసిన వారికి స్టిచ్చింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. పురుషుల దైనందిన, వివాహాది శుభకార్యాలకు కావలసిన దుస్తులు ఈ షోరూంలో అందుబాటులో ఉన్నాయనీ వరుణ్ సందేష్ పేర్కొన్నారు. త్వరలోనే సంస్థ మరిన్ని బ్రాంచ్ లు స్థాపించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
Be first to comment on this News / Article!
|