'సంతోషం' అవార్డులు 21న
చిత్ర పరిశ్రమకు ప్రోత్సాహకంగా 'సంతోషం' సినీ మ్యాగజైన్ ఏటా అందిస్తున్న 'సంతోషం ఫిల్మ్ అవార్డ్స్' ప్రదానం ఈనెల 21న జరుగనుంది. 'సంతోషం' మ్యాగజైన్ ఏడు వసంతాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో 7వ వార్షికోత్సవాన్ని ఆదివారంనాడు ఎఫ్.ఎన్.సి.సి.లో పత్రిక అధినేత సురేష్ కొండేటి నిర్వహించారు. ఈ సందర్భంగా 'సంతోషం' ఫిల్మ్ అవార్డ్స్ వివరాలను ఆయన ప్రకటించారు.
సినీ పరిశ్రమకు ప్రోత్సాహకంగా తాము ఏటా ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తున్న సంతోషం ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఈసారి హైద్రాబాద్ ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్ లో ఈనెల 21న నిర్వహించనున్నట్టు కొండేటి తెలిపారు. ప్రముఖ డాన్స్ మాస్టర్ అమ్మరాజశేఖర్, నిక్సన్ తదితరులతో పాటు యువ నటీనటులు ఈ కార్యక్రమంలో ఆసక్తికరమైన ప్రోగ్రామ్స్ ఇవ్వనున్నట్టు చెప్పారు. సురేష్ ఏటా నిర్వహిస్తున్నట్టు గానే ఈ ఏడాది జరుపనున్న ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం దిగ్విజయం కావాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ,సంగీత దర్శకుడు కోటి, నటి మాధవీలత, కాజల్ అగ్వరాల్, నిక్సన్ తదితరులు అభిలషించారు.
Be first to comment on this News / Article!
|