అల్లు అర్జున్ 'ఆక్రందన'
'పరుగు' చిత్రంలో నటనకు గాను ఇటీవలే ఉత్తమ నటుడుగా 'ఫిల్మ్ ఫేర్' అవార్డు అందుకున్న స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇంతవరకూ ప్రేక్షకుల ముందుకు రాలేదు. తన కెరీర్ కు తొలినాళ్లలో మంచి బ్రేక్ ఇచ్చిన 'ఆర్య' చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న 'ఆర్య 2' చిత్రంలో ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఈ చిత్రం తుదిమెరుగుల దశలో ఉంది. భోగవల్లి ప్రసాద్, ఆదిత్య బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ ('ఆర్య' ఫేమ్) దర్శకుడు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 22 ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నప్పటికీ రామ్ చరణ్ 'మగధీర' తన హవా చాటుకుంటుండటంతో సెప్టెంబర్ కు 'ఆర్య-2 ' వెళ్లింది. ఈ చిత్రానికి 'ఆర్య-2' అనేది వర్కింగ్ టైటిల్ అయినప్పటికీ టైటిల్ కోసం ప్రస్తుతం పలు పేర్లు పరిశీలిస్తున్నారు.
థ్రిల్లర్ కథాంశంగా ఈ చిత్రం ఉంటుందనీ, అందుకు తగినట్టుగా 'ఆక్రందన' అనే టైటిల్ యాప్ట్ గా ఉంటుందనీ యూనిట్ సభ్యుల అభిప్రాయంగా కొద్దిరోజులుగా వినిపిస్తోంది. అయితే ఈ టిటైల్ కంటే బెటర్ టైటిల్ ను కూడా దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ కు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, మరో జంటగా నవదీప్, శ్రద్ధాదాస్ నటిస్తున్నారు. 'పరుగు' చిత్రం విడుదలై చాలా గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ గా నిలుపుతుందని అంటున్నారు. ఈ చిత్రానికి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|