అల్టిమేట్ స్టార్ తో శృతి?
విలక్షణ నటుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ బాలీవుడ్ లో 'లక్' చిత్రంతో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తొలి సినిమాలోనే బికినీ యాక్ట్ తో సంచలనం సృష్టించిన శృతి నటనపరంగా మాత్రం యావరేజ్ అనిపించుకుంది. సినిమా ఫలితమూ డిటోనే. శృతి తర్వాత స్టెప్ ఏమిటి? తీరికలేనంత బిజీ అని చెబుతోంది ఈ డైనమిక్ లేడీ. ప్రస్తుతం రాజ్ కమల్ పతాకంపై కమల్ హాసన్ నటిస్తూ, నిర్మిస్తున్న 'ఈనాడు' చిత్రంపైనే తన పూర్తి శక్తియుక్తులు కేంద్రీకరిస్తున్నానని శృతి చెప్పుకొచ్చింది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. తెలుగులో కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిందీ 'ఎ వెన్స్ డే' చిత్రానికి ఇది రీమేక్. శృతి కమల్ హాసన్ సంగీత అందిస్తోంది. పనిలో పనిగా తమిళంలో అల్టిమేట్ స్టార్ అజిత్ సినిమాలో శృతి నటించబోతోందంటూ ఊహాగానాలూ మొదలయ్యాయి. వీటిని అంతే దూకుడుగా శృతి ఖండిచింది.
'ప్రస్తుతం నా దృష్టంతా ఈనాడు చిత్రం మీదే ఉంది. సంగీతం నా ఆరోప్రాణం. ప్రస్తుతం నిద్రాహారాలు మాని ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాను. పాపా కమల్ కోరిన రిజల్ట్ ఇవ్వాలన్నదే నా తపన. ఆయన అంచనాలను నిజం చేయబోతున్నాను' అని శృతి చెప్పుకొచ్చింది. అజిత్ సరసన నటించబోతున్నాననే వార్త పూర్తిగా నిరాధారమనీ, ఒకవేళ భవిష్యత్తులో మంచి పాత్ర లభిస్తే ఆయనతో నటించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవనీ వివరణ ఇచ్చింది. అజిత్ గ్రేట్ యాక్టర్ అని కితాబు కూడా ఇచ్చింది. ఆసక్తికరంగా కమల్ నటుడుగా 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో 'ఈనాడు' ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం ఆయన ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. ఈనెలలోనే ఆడియో, సెప్టెంబర్ లో సినిమా విడుదలకు కమల్ ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|