'శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం'
సాప్ట్ వేర్ రంగం నుంచి సైబర్ విలేజ్ సొల్యూషన్స్ సంస్థ తమ సేవలను యానిమేషన్ రంగానికి విస్తరించింది. ఇందులో భాగంగా టీవీ, హోమ్ ఎంటర్ టైన్ మెంట్, ఐపి. టివి, 3జి మొబైల్ కోసం పలు యానిమేషన్ సినిమాలు, సీరియల్స్ నిర్మిస్తోంది. ఇటీవలే 2డి యానిమేషన్ లో 'పంచతంత్రం'ను నిర్మించి విడుదల చేసింది. అనంతరం 3డి యానిమేషన్ లో తొలి ప్రయత్నంగా 'ఆలీబాబా 40 దొంగలు'అనే లఘు చిత్రాన్ని నిర్మించి విడుదల చేసింది. తాజాగా ఈ సంస్థ 3డి యానిమేషన్ వీడియో అల్బమ్ గా 'శ్రీ వేంకటేశవర సుప్రభాతం'ను రూపొందించింది. పెండ్యాల రాంబాబు, సురేష్, శ్రీలత తదితరులు ఈ ఆల్బమ్ కు పనిచేశారు. ఈ ఆల్బమ్ ను మంగళవారంనాడు మీడియాకు ప్రదర్శించారు.
అనంతరం పెండ్యాల రాంబాబు మాట్లాడుతూ, తమ సంస్థ పలు యానిమేషన్ చిత్రాలు, వీడియో ఆల్బమ్స్ ను విడుదల చేయనుందని తెలిపారు. పదేళ్లుగా తమ సంస్థ ఎంతో శ్రమించి ఈ స్థాయికి ఎదిగిందని చెప్పారు. ఈనెల రెండో వారంలో 'శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం' వీడియో ఆల్బమ్ ను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో హనుమాన్ చాలీసా, గోవింద నామాలు వంటి అల్బమ్స్ కూడా రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. యానిమేషన్ ప్రాజెక్టులలో సంస్థ పురోగతిని డాక్టర్ జానకి, కృష్ణవేణి వివరించారు.
Be first to comment on this News / Article!
|