రవితేజ 'శంభో శివశంభో'
రవితేజ కథానాయకుడుగా 'శంభో శివశంభో' చిత్రం ప్రారంభమైంది. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజకు జంటగా ప్రియమణి నటిస్తోంది. హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో బుధవారం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. మహూర్తపు సన్నివేశానికి 'అరుంధతి' నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి క్లాప్ ఇవ్వగా, రవికిషోర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. తమిళంలో రూపొందిన 'నాడోడిగల్' చిత్రానికి ఇది రీమేక్ చిత్రం. తమిళంలో దర్శకత్వం వహించిన సముధిరకాని తెలుగులో కూడా దర్శకత్వం వహించడం విశేషం. అల్లరి నరేష్, శివబాలాజీ, సునీల్, అభినయ, కృష్ణభగవాన్, కృష్ణుడు, ముఖేష్ రుషి, రాజారవీంద్ర, ఆహుతీప్రసాద్, జీవ, సుధ, కిన్నెర, సురేష్ తేజ్, ప్రవీణ్, చిత్రలేఖ, రాధాకుమారి తదితరులు నటిస్తున్నారు. ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 16 నుంచి జరగనున్నది. కర్నూలు, రాజమండ్రి, హైదరాబాద్ లలో షూటింగ్ చేస్తారు. తమిళ చిత్రానికి సంగీతాన్ని అందించిన సుందర్ సి.బాబు తెలుగులో ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రహి జి ముత్తయ్య, పాటలు చిన్ని చరణ్, ఫైట్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాత బెల్లంకొండ సురేష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సముధిరకాని.
Be first to comment on this News / Article!
|