ధర్మవరపు చిత్రం ప్రారంభం
హాస్య నటులుగా పేరు తెచ్చుకుని కధానాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించకున్న బ్రహ్మానందం, ఆలీ, సునీల్, కృష్ణభగవాన్ల కోవలోనే ధర్మవరపు సుబ్రమణ్యం కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ధర్మవరపు సుబ్రమణ్యం కథానాయకుడుగా రాజా ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రాజా ఆర్.ఆర్. ఓ కొత్త చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి రామ్ కుమార్ దర్శకుడు. ధర్మవరపు సుబ్రమణ్యం జోడిగా ఆర్తి అగర్వాల్ నటించనున్నారు. నేటి నుండి ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోస్ లో ప్రారంభమైంది. కమెడియన్ గా మంచి గుర్తింపు ఉన్న ధర్మవరపు ఈ సినిమాలో వినూత్నంగా కనిపించనున్నారనీ, ఆర్తి అగర్వాల్ తో పాటు షఫాలీ శర్మ, మరో కొత్తమ్మాయి హీరోయిన్లుగా నటించబోతున్నారనీ ఆయన తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సూర్య, ఎల్.బి.శ్రీరామ్, దువ్వాసి మోహన్, జీవా, తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి దీపికా రాజు మాటలు, పైడాల శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|