శ్రీను 'ఉడతా ఉడతా ఊచ్'
మురళీగణేష్ దర్శకత్వంలో విజి వెంచర్స్ పతాకంపై తడక రాజేష్ నిర్మిస్తున్న 'ఉడతా ఉడతా ఊచ్' చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగింది. శివాజీ, అల్లరి నరేష్, వరుణ్ సందేశ్ లు ఈ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ హాస్యనటుడుగా పేరు పొందిన శ్రీను హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్ర కథ చాలా బాగుందన్నారు. యూనిట్ అంతటికీ ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నానని అన్నారు. కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీను హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అల్లరి నరేష్ ఆకాంక్షించారు. వరణ్ సందేశ్ కూడా ఈ చిత్రం సక్సెస్ కావాలని కోరుకున్నారు. 'ఉడతా ఉడతా ఊచ్' ద్వారా తనకు హీరోగా పరిచయమయ్యే అవకాశం వచ్చినందుకు శ్రీను తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
దర్శకుడు మురళీగణేష్ మాట్లాడుతూ చక్కటి కథ, అందుకు తగిన తారగణాన్ని ఎంపికచేసుకుని, అందరి సహకారంతో ఈ చిత్రాన్ని తీయగలిగానని చెప్పారు. నిర్మాత తడకల రమేష్ మాట్లాడుతూ ఈ చిత్రం మా సంస్థ నుండి వెలువడుతున్న రెండో చిత్రమన్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని, సెప్టెంబర్ లో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. డ్యాన్స్ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. అందుకే ఈ సినిమాను మైఖేల్ జాక్సన్ కు అంకింతమిస్తున్నాం అని అన్నారు. విజయభాస్కర్, అక్షయ్, బ్రహ్మానందం, సునీల్, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, చలపతిరావు, కొండవలస, రజిత, తెలంగాణ శకుంతల, మెల్కోటి, ప్రసన్న, ఎం.ఎస్ విక్రమ్, తదితరులు నటిస్తున్నారు. సంగీతం శివ, మాటలు సాహు, ఫొటోగ్రఫీ గొడితి వి.ప్రసాద్, నిర్మాత రాజేష్ తడకల, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మురళీగణేష్.
Be first to comment on this News / Article!
|