బాలకృష్ణ 'సింహా' ప్రారంభం
నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా కొత్త చిత్రం 'సింహా' ప్రారంభమైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కీర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైద్రాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో గురువారం ఉదయం అట్టహాసంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. బాలకృష్ణపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి డి.సురేష్ బాబు క్లాప్ ఇచ్చారు. దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఇవివి సత్యనారాయణ స్క్రిప్టు అందజేశారు. నందమూరి హీరోలైన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారకరత్న ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఎంఆర్ వి ప్రసాద్, రమేష్ ప్రసాద్, బెల్లంకొండ సురేష్, బి.గోపాల్ తదితరులు హాజరయ్యారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ, బాలకృష్ణను దర్శకత్వం వహించే అవకాశం కొద్దిమందికే దక్కిందనీ, ఇప్పుడు తనకు ఆ అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాననీ అన్నారు. బాలయ్య ఇందులో సేవియర్ పాత్ర పోషిస్తున్నారనీ, బాలయ్య బాబు అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుందనీ చెప్పారు. నటీనటుల ఎంపిక ఇంకా జరుగుతోందనీ, బాలకృష్ణతో నటించేందుకు టాప్ హీరోయిన్లను సంప్రదిస్తున్నామనీ తెలిపారు. తొలుత హైద్రాబాద్, వైజాగ్ లో షూటింగ్ జరుపుతామనీ, ఈనెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందనీ చెప్పారు. 2010 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రెడీ చేస్తామని అన్నారు. బాలకృష్ణ చిత్రానికి తొలిసారి తాను సంగీతం అందిస్తున్నట్టు సంగీత దర్శకుడు చక్రి తెలిపారు. ఈ అఫర్ తనకు వచ్చినప్పుడు కొంత టెన్షన్ పడ్డాడనీ, ఇదొక ఛాలెంజ్ గా భావించి సెన్సేషన్ హిట్ సాంగ్స్ అందిస్తాననీ చెప్పారు.
Be first to comment on this News / Article!
|