ప్రిన్స్ బర్త్ డే వారోత్సవాలు
ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని అభిమానులు వారం రోజుల పాటు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఈనెల 9న మహేష్ బర్త్ డే. ఆయన పుట్టినరోజును వారం రోజుల పాటు జరపనుండటం వరుసగా ఇది రెండోసారి. గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకూ ప్రిన్స్ బర్త్ డే వారోత్సవం నిర్వహిస్తున్నట్టు సూపర్ స్టార్ మహేష్ సేన అధ్యక్షుడు దిడ్డి రాంబాబు తెలిపారు. ఈ వారం రోజులూ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
నేత్ర దాన క్యాంపులు, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, మొక్కలు నాటడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 9వ తేదీ క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన రోజు కూడా కావడంతో పలువురు స్వాతంత్ర్య సమరయోధులను కూడా తాము సన్మానించనున్నట్టు దిడ్డి రాంబాబు చెప్పారు.
Be first to comment on this News / Article!
|