రజనీ అల్లుడితో హన్సిక
సిమ్లా యాపిల్ ను తలపించే హీరోయిన్ హన్సికా మోత్వానికి లక్కీగాళ్ గా పేరుంది. 'దేశముదురు', 'కంత్రీ' వంటి కమర్షియల్ సక్సెస్ చిత్రాల్లో నటించిన హన్సిక ఇటీవల 'బిల్లా' చిత్రంలో ఓ ఐటెం సాంగ్ లో కూడా నటించింది. ఆ చిత్రం కూడా కమర్షియల్ హిట్టే. తెలుగులో తనకు వచ్చిన డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని హన్సిక ఆచిచూతి సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. ప్రస్తుతం నితిన్ హీరోగా ఈశ్వర్ దర్శకత్వంలో వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్ పై మల్ల విజయప్రసాద్ ('సిద్ధు ఫ్రమ్ సికాకుళం' ఫేమ్) నిర్మిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. పనిలో పనిగా తమిళ పరిశ్రమలోకి కూడా హన్సిక అడుగుపెడుతోంది.
ఇలియానా, అనుష్క, తమన్నా వంటి హీరోయిన్ల కోసం తమిళ నిర్మాతలు పోటీపడుతున్న తరుణంలో హన్సిక సైతం ఇప్పుడు కోలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకోనుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ సరసన 'మాపిల్లై' అనే చిత్రంలో హన్సిక హీరోయిన్ గా ఎంపికైంది. ఇందుకోసం భారీ రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చి సత్తా చాటుకున్న హన్సిక ఇప్పుడు టాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేసుకుంటుందని అనుకుందాం.
Be first to comment on this News / Article!
|