ఎప్పటికప్పుడు విలక్షణ ఇతివృత్తాలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వరుస హిట్లు సాధిస్తున్న విక్టరీ వెంకటేష్ తన తదుపరి చిత్రాల విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 'చింతలకాయల రవి' చిత్రం తర్వాత యాక్షన్ ఓరియెంటెండ్ చిత్రమైన 'ఈనాడు' లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను వెంకటేష్ పోషిస్తున్నారు. కమల్ హాసన్ తో కలిసి వెంకీ నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం తర్వాత పూర్తి ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న 'నమో వెంకటేశ' చిత్రం షూటింగ్ లో వెంకటేష్ అడుగుపెట్టారు. ఇందులో వెంట్రిలాక్విస్ట్ గా విలక్షణ పాత్రను వెంకీ పోషిస్తున్నారు. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం యూరప్ లో నెలరోజుల కీలక షెడ్యూల్ జరుపుకొంటోంది. వెంకటేష్ కు జోడిగా త్రిష నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత వెంకటేష్ నటించబోయే చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించనున్నారు. ఇందులో వెంకటేష్ ద్విపాత్రాభినం చేయనున్నారు. దీనిలో పవర్ ఫుల్ డాన్ పాత్ర ఒకటని తెలుస్తోంది.
వెంకటేష్ గతంలో ఫ్రీడం ఫైటర్ తరహా పాత్రలు పోషించినప్పటికీ డాన్ పాత్రను పోషించిన దాఖలాలు లేవు. వెంకటేష్ ను కొత్త స్టయిల్ లో చూపించే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు అమ్మ రాజశేఖర్ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. వెంకటేష్ సరసన నయనతార పేరు పరిశీలనలో ఉంది.