తమిళంలో 'మగధీర' రీమేక్
రామ్ చరణ్ కథానాయకుడుగా 1200 ప్రింట్లతో భారీ స్థాయిలో విడుదలైన 'మగధీర' చిత్రం తొలిరోజు, తొలి వారం రికార్డులని భారీ మార్జిన్ తో క్రాస్ చేసే దిశగా దూసుకుపోతుండటం చిత్ర యూనిట్ ను సంబరంలో ముంచెత్తుతోంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ లో తొలివారంలోనే ఈ చిత్రం 20 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 'మగధీర' మేనియా కొనసాగుతోందనీ, మరో రెండు మూడు వారాల్లో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా అవతరించడం ఖాయమని కూడా వీరంటున్నారు. దీనికితోడు 'మగధీర' చిత్రం చుట్టూ పలు వివాదాలు చుట్టుముడుతుందటం కూడా అదనపు పబ్లిసిటీకి కారణమవుతోంది. ఇందులోని వివాదాస్పద పాట గురించి, హాలీవుడ్ 'ది మిత్', '300' చిత్రాల నుంచి కాపీ కొట్టారనే ప్రచారం వంటివి గణనీయంగా ప్రేక్షకులను థియేటర్ల వైపు మళ్లిస్తున్నారు. మరోవైపు కలెక్షన్, రికార్డుల రిపోర్ట్ ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తమిళంలో మళ్లీ రామ్ చరణ్ తోనే రీమేక్ చేయాలనే ఆలోచన ఉన్నట్టు తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు
'జల్సా, హిందీ గజనీ చిత్రాల తర్వాత గీతా ఆర్ట్స్ కు దక్కిన బిగ్గెస్ట్ హ్యాట్రిక్ ఇది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ రిజల్ట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. బన్నీ అయితే ఎంత సంబరంగా ఉన్నాడో చెప్పలేం. చరణ్ తో బన్నీకి ఉన్న అనుబంధం అలాంటింది. మన బ్యానర్ లో చరణ్ సినిమాతో బిగ్గెస్ట్ హాట్రిక్ ఇవ్వాలని ముందు నుంచీ నాతో చెబుతూ వచ్చాడు. అలానే జరిగింది. చాలా మంచి రిపోర్ట్స్, కలెక్షన్లు వస్తున్నాయి. హిందీలో సినిమా రీమేక్ చేస్తారా అని అంతా అడుగుతున్నారు. రాజమౌళి ఈ ప్రస్తావన ఇంకా తేలేదు. ఆ మాట ఎలా ఉన్నా రామ్ చరణ్ తోనే తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకుంటున్నాను' అంటూ అరవింద్ వెల్లడించారు. సో...'మగధీర' రీమేక్ తో రామ్ చరణ్ త్వరలో తమిళనాట కూడా కాలుపెడతారని అనుకోవచ్చు.
Be first to comment on this News / Article!
|