బాలకృష్ణతో సెక్సీ బ్యూటీస్
నందమూరి బాలకృష్ణ 'సింహా' చిత్రం ప్రారంభోత్సవంలో కనిపించిన గెటప్ అందరినీ ఆకట్టుకుంటోంది. మూడ్రోజుల క్రితం ఈ చిత్రం షూటింగ్ నందమూరి హీరోల సమక్షంలో సందడిగా ప్రారంభమైంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కీర్తి నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం 15 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందనుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అయితే త్వరలోనే ఆ హీరోయిన్ల పేర్లు వెల్లడి చేస్తామని దర్శకనిర్మాతలు చెప్పినట్టికీ ఒక హీరోయిన్ గా ఇప్పటికే భారీ అందాల బ్యూటీ నమిత ఎంపిక ఖరారైనట్టు సమాచారం. కాగా, సెకెండ్ హీరోయిన్ గా బాలీవుడ్ లేలేత పరువాల జవ్వని మినిస్సా లంబా ను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.
పంజాబీ అమ్మాయి మినిస్సా 'యహాన్' చిత్రం ద్వారా 2005లో బాలీవుడ్ కు పరిచయమై 'హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్', 'హే బేబీ', 'దస్ కహానియా', 'బచ్నా యే హసీనో', 'కిడ్నాప్' వంటి సుమారు డజను సినిమాల్లో నటించి యువ ప్రేక్షకులను తన గ్లామర్ తో కనువిందు చేసింది. తొలిసారి బాలకృష్ణ వంటి అగ్రహీరోతో తెలుగులో అడుగుపెట్టేందుకు ఆమె సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. నమిత, మినిస్సా కలిస్తే వెండితెరపై గ్లామర్ మోత మోగవచ్చు. మూడో హీరోయిన్ ఎంపిక కూడా జరుగుతోంది. ఈనెల 24 నుంచి 'సింహా'రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. హైద్రాబాద్, వైజాగ్ లో షూటింగ్ అనంతరం ఫారెన్ షెడ్యూల్ ఖరారవుతుంది. బాలకృష్ణ చిత్రానికి తొలిసారిగా చక్రి సంగీతం అందస్తుండటం మరో విశేషం. 2010 సంక్రాంతి కానుకగా 'సింహా' ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Be first to comment on this News / Article!
|