ఏడాదిలో నాలుగు హిట్లు
నాలుగు భాషల్లో నాలుగు సూపర్ హిట్లు. అది కూడా ఒకే ఏడాదిలో వచ్చినవే. అలాంటి అరుదైన రికార్డును తెలుగు ప్రేక్షకుల అభిమాని హాసిని జెనీలియా సాధించింది. 'తుఝే మేరి కసమ్'తో హిందీలో తొలి అడుగు వేసిన జెనీలియా ఆ తర్వాత శంకర్ 'బాయ్స్' ద్వారా దక్షిణాదిలో కాలుపెట్టింది. ఆ తర్వాత నుంచి ఆమె వెనక్కి తిరిగిచూసుకోలేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో జెనీలియా నటిస్తూ వరుస సక్సెస్ లను ఎంజాయ్ చేస్తోంది.
'ఒకే ఏడాదిలో నాలుగు భాషల్లో చేసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ కావడం బహుశా నా విషయంలోనే జరిగి ఉండొచ్చు. కన్నడంలో నటించిన సత్య, తమిళ సంతోష్ సుబ్రమణియం, తెలుగు రెడీ, హిందీ జానే తు..య జానే న చిత్రాలు నాలుగూ పెద్ద సక్సెస్ సాధించాయి. అలాగే బొమ్మరిల్లు చిత్రాన్ని మూడు భాషల్లో చేసిన హీరోయిన్ కూడా నేనే. తమిళంలో ఈ చిత్రం సంతోష్ సుబ్రమణియంగా, హిందీలో ఇట్స్ మై లైఫ్ గా తీశారు' అని జెనీలియా ఇటీవల తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అన్ని భాషల్లోనూ తాను నటించడానికి ఇష్టపడతాననీ, ముందుగా స్క్రిప్టు తనకు నచ్చాలనీ, అలాగే చక్కటి సహకారం అందించే దర్శకనిర్మాతలకు ప్రాధాన్యమిస్తాననీ తెలిపారు. తాను మంచి ఎథ్లెట్ అనీ, నేషనల్ ఫుట్ బాల్ టీమ్ లో ఆడాననీ, తన ఫిట్ నెస్ కు ఇది ప్రధాన కారణమని చెప్పుకొచ్చింది. రితీష్ దేశ్ ముఖ్ తో ఎఫైర్ గురించి ముచ్చటిస్తూ 'రితీష్ నాకు మంచి స్నేహితుడు. ఇదే విషయాన్నిచాలాసార్లు చెప్పాను. మీడియా మాత్రం తమకు తోచినట్టు ఫోకస్ చేస్తోంది. ఇలాంటి రాతల వల్ల మా రిలేషన్ లో వచ్చే మార్పు ఏమీ ఉండదు. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉంటున్నాను' అంటూ జెనీలియా నవ్వుతూ చెప్పింది.
Be first to comment on this News / Article!
|