అక్టోబర్ 2న 'మహాత్మా'
మనదేశానికి ఎందరో భారతరత్నలు ఉన్నా, జాతిపిత ఒకరేననీ, మహాత్మాగాంధీ సిద్ధాంతాలు నేటికీ ఆచరణయోగ్యమనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం 'మహాత్మ'. హీరో శ్రీకాంత్ 100వ చిత్రంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో సి.ఆర్.మనోహర్ 12 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ కు జోడిగా భావన నటిస్తోంది. ఈ చిత్రం ఒక షెడ్యూల్ మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మహాత్మాగాంధీ జన్మదినోత్సవ కానుకగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
'మహాత్మ' చిత్రాన్ని గత ఫ్రిబ్రవరి 15న పలువురు సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు. చిరంజీవి, దాసరి నారాయణరావు, కె.రాఘువేంద్రరావు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇదే తరహాలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని కూడా ఈనెలలోనే గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మహాత్మాగాంధీ మనువడు తుషార్ గాంధీ చేతుల మీదుగా ఆడియో విడుదల జరపాలని కృష్ణవంశీ అభిలషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి పరుచూరి సోదరులు రచన, భరణి కె ధరణ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|