'అదే నువ్వు అదే నేను'
శశాంక్, ఆర్య మీనన్ ('చక్ దే ఇండియా' ఫేం) జంటగా మెషక్ మూవీ మేకర్స్ పతాకంపై జాన్ బాప్టిస్ట్ నిర్మాతగా శ్రీనివాస్ బల్లా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అదే నువ్వు అదే నేను'. ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమైంది. ఈ వారంలోనే సెన్సార్ కు వెళ్తోంది. హైద్రాబాద్ లో సోమవారంనాడు ఆ విశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది.
ఇది పొయిటిక్ లవ్ స్టోరీ అనీ, కథలో చక్కటి ఎమోషనల్ డ్రామాతో పాటు యూత్ కు చక్కటి మెసేజ్ కూడా ఉంటుందని దర్శకుడు శ్రీనివాస్ బల్లా తెలిపారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారనీ, మలేషియాలోని అందమైన లొకేషన్లలో 3 పాటలు చిత్రీకరించామని చెప్పారు. మలేసియా, రామచంద్రాపురం, హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో టాకీ పార్ట్ జరిపామని చెప్పారు. మోహన్ సితార స్వరపరచిన 5 సాంగ్స్ వేటికవే ప్రత్యేకత కలిగి ఉంటాయనీ, వేల్ రికార్డ్స్ ద్వారా విడుదలైన ఆడియోకి శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. హీరో శశాంక్, హీరోయిన్ ఆర్యా మీనన్ కు , దర్శకుడుగా తనకు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇస్తుందన్నారు. తొలికాపీ చూసిన తాము చాలా ఉత్సాహంగా ఉన్నామనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నామనీ చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గాయత్రి, సరహా, రంగనాథ్, సత్యం రాజేష్, ఏవీయస్, దువ్వాసి మోహన్, మేల్కొటి, రాజా శ్రీధర్, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రషీద్ మోపెన్ సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, మణి సుచిత్ర కళాదర్శకత్వం వహిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|