అనంత ఎస్పీని కలిసిన వర్మ
రామ్ గోపాల్ వర్మ తన తదుపరి చిత్రమైన 'రక్తచరిత్ర'ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'అజ్ఞాత్' (తెలుగులో 'అడవి') చిత్రం ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దీంతో ఆయన తెలుగు, హిందీ భాషల్లో రూపొందించనున్న'రక్తచరిత్ర' షూటింగ్ కు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సోమవారంనాడు ఆయన అనంతపురం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం.కె.సింగ్ ను కలుసుకున్నారు. ఫ్యాక్షన్ ఏరియాగా పేరున్న అనంతపురం జిల్లాలోని పలు ఏరియాల్లో షూటింగ్ జరుపనున్నందున తగిన సెక్యూరిటీ ఏర్పాట్లు గురుంచి ఎస్.పి.తో వర్మ మాట్లాడారు.
పరిటాల రవి నిజజీవిత సంఘటనల ఆధారంగా 'రక్తచరిత్ర' చిత్రాన్ని వర్మ తెరకెక్కించబోతున్నారు. పరిటాల రవి పాత్రను వివేక్ ఒబెరాయ్, మరో కీలక పాత్రను తమిళ స్టార్ హీరో సూర్య పోషించబోతున్నారు. ఇది రెండు పార్ట్ లుగా 'రక్తచరిత్ర 1', 'రక్తచరిత్ర 2' పేరుతో రూపొందుతుంది. తొలి పార్ట్ షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|