'యు అండ్ ఐ' ఆడియో
దర్శకుడు రంజిత్ బెల్లూరి మాట్లాడుతూ, నిర్మాత రవీందర్ తోట మంచి మానవతా వాదనీ, ఆయనంటే తనకెంతో ఇష్టమనీ చెప్పారు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి మంచి రిజల్ట్ ఇచ్చారనీ, సినిమా చాలా బాగా వచ్చిందనీ చెప్పారు. మంచి సక్సెస్ సాధిస్తుందనే గట్టి నమ్మకం తనకుందన్నారు. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కార్తిక్ కృతజ్ఞతలు తెలిపారు. సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. హీరోగా తనకు తొలి చిత్రమిదనీ, ఆడియోతో పాటు సినిమా కూడా మంచి విజయం సాధించి అందరికీ పేరు తేవాలని కోరుకుంటున్నట్టు రోహన్ పేర్కొన్నారు. మంచి బ్యానర్ ద్వారా పరిచయం కావడం, ఇంత గ్రాండ్ గా ఈ ఫంక్షన్ జరగడం చాలా సంతోషంగా ఉందని అదితి పేర్కొంది.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|