'ఆంజనేయులు' ఓవర్సీస్ రికార్డ్
ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలైన తెలుగు చిత్రాల్లో రెండే సూపర్ హిట్ అయ్యాయి. వాటిలో రవితేజ నటించిన 'కిక్' ఒకటి. ఈ చిత్రం సక్సెస్ తో రవితేజ తదుపరి చితమైన 'ఆంజనేయులు'కు విపరీతమైన క్రేజ్ ఏర్పడి మంచి బిజినెస్ కూడా జరిగింది. పరశురామ్ ('యువత' ఫేమ్) దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ బాబు తొలిసారిగా నిర్మించిన ఈ చిత్రం ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. విడుదలకు ముందే ఈ చిత్రం ద్వారా నిర్మాత 5 కోట్ల రూపాయల టేబుల్ ప్రాఫిట్ అందుకున్నారు. తాజాగా ఓవర్సీస్ లోనూ 'ఆంజనేయులు' చిత్రం ప్రీ-రిలీజ్ రికార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా (ఇండియాను మినహాయించి) 40కి పైగా కేంద్రాల్లో ఈ చిత్రం విడుదలవుతుండగా, ఒక్క అమెరికాలో 32 సెంటర్లలో విడుదలవుతోంది. రవితేజకు ఇది సరికొత్త రికార్డు. ఈ తరహా ఓపెనింగ్ రికార్డును కొందరు హీరోలు మాత్రమే సొంతం చేసుకున్నారు.
అమెరికాలోని 6 డిజిటల్ లొకేషన్లలో (ఎడిసన్, సాన్ హోసె, ఇతర ప్రాంతాలు) రెండు స్క్రీన్ లతో ఈ చిత్రం ప్రదర్శితం కానుంది. తెలుగు సినిమాల్లోనే ఇది రికార్డు. అలాగే అమెరికాలో తొలివారంలో 360కి పైగా రికార్డు స్థాయి ప్రదర్శనలకు రంగం సిద్ధమైంది. కేరిలో తొలివారం ప్రదర్శితమవుతున్న సినిమా కూడా ఇదే. ఇది రవితేజకు మరో రికార్డు. తుల్సా ఓకె, స్ర్రింగ్ దలె ల్లో తొలివారంలో విడుదలవుతుండటం రవితేజకు రికార్డుగా చెప్పొచ్చు. కేవలం రెండు సినిమాలే ఈ రికార్డును సాధించాయి. సౌత్ కరోలినాలో తొలివారంలో ప్రదర్శితమవుతున్న రవితేజ సినిమా కూడా 'ఆంజనేయులు' కావడం విశేషమని గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ (యుఎస్ఎ) తెలియజేసింది.
Be first to comment on this News / Article!
|