సెప్టెంబర్ లో 'రామ్ దేవ్'
అబ్బాస్, ఆకాష్, సాయికిరణ్, గ్రేసీసింగ్, అర్చన ప్రధాన పాత్రధారులుగా ఎస్.బి.కె.ఫిలింస్ పతాకంపై ఎస్.కె.బషీర్ దర్శకత్వంలో కరీమున్నీసా నిర్మిస్తున్న చిత్రం 'రామ్ దేవ్'. ఒక మాట మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్టు బషీర్ తెలిపారు. హైద్రాబాద్ లో మంగళవారంనాడు ఆ విశేషాలను ఆయన తెలియజేశారు.
పక్కా మాస్ కథలో ఈ చిత్రం రూపొందుతోందనీ, మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుందనీ ఆయన తెలిపారు. పాత్రలకు తగ్గ నటీనటులతో ఈ చిత్రం తెరకెక్కుతోందన్నారు. టాకీ పార్ట్ తో పాటు, ఐదు పాటల చిత్రీకరణ పూర్తయిందనీ, మిగిలిన ఒక్క పాటను ఈ నెలాఖరులో పూర్తి చేస్తామని తెలిపారు. గతవారంలో హైద్రాబాద్, వైజాగ్ లలో రెండు పాటల చిత్రీకరణ జరిపామని తెలిపారు. ఇందులో ఆలీ, హేమ, సత్తెన్న, దాసన్న వేణు, సూర్య, చిత్రం శ్రీనులపై తీసిన కామెడీ ట్రాక్ ప్రేక్షకులను నవ్వులలో ముంచెత్తుతుందని చెప్పారు. దర్శకుడిగా తనకు ఇది తొలి చిత్రం కావడంతో ఎంతో కష్టపడి అన్ని వర్గాలను అలరించే విధంగా చిత్రాన్ని మలిచినట్టు చెప్పారు. ఈ చిత్రానికి డబ్బింగ్ పూర్తి కావ్చిందనీ, సెప్టెంబర్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని కరీమున్నీసా తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో పరుచూరి గోపాలకృష్ణ, కవిత, సూర్య, సంగీత, గీతాసింగ్, మంజుభార్గవి తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం ఎస్.కె.బషీర్ అందిస్తున్న ఈ చిత్రానికి విజయశ్రీ సినిమాటోగ్రఫీ, నందు ఫైట్స్, రమేష్ ఎడిటింగ్, శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|