ఇష్టపడితే...(ప్రేమేనా?)
ఆకర్షణ, ఇష్టం అనే పదాలకు యువత చెబుతున్న అర్ధం ఏమిటనే పాయింట్ తో రూపొందుతున్న చిత్రం 'ఇష్టపడితే..' (ప్రేమేనా?). పడాల వెంకటరెడ్డి సమర్పణలో వరలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై పడాల వరలక్ష్మి, ఆర్.సూర్యప్రకాష్, పొలిశెట్టి చంద్రశేఖర్, జి.నారాయణరెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమ్.శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుభాష్ రాయల్, ఫరాఖాన్, అమృతవల్లి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది.
రాజమండ్రి, రామచంద్రాపురం, యానం, రావులపాలెం, వైజగ్, అరకు తదితర ప్రాంతాల్లో 80 శాతం టాకీ, ఐదు పాటల చిత్రీకరణ పూర్తి చేసినట్టు నిర్మాతలు తెలిపారు. మరో పాట, బ్యాలెన్స్ టాకీ పార్ట్ ను ఈనెల 10 నుంచి వైజాగ్ లో జరుగుతున్న షెడ్యూల్ లో పూర్తి చేయనున్నట్టు చెప్పారు. నేటి యువతీ యువకులకు చక్కటి సందేశాన్నిచ్చే ప్రయత్నం ఈ చిత్రంలో చేశామనీ, ఆకర్షణ, ఇష్టం అనే మాటల్ని యువత ఏవిధంగా అర్ధం చేసుకుంటుందో ఇందులో చెప్పబోతున్నామనీ అన్నారు. సకుటుంబ సమేతకంగా చూసే చిత్రమిదని తెలిపారు. సెప్టెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి రెండో వారంలో ఆడియో, దసరా కానుకగా సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో వేణుమాధ్, కృష్ణ భగవాన్, రఘునాథరెడ్డి, వినోద్, హేమ, జీవా, సత్యశ్రీ, ఉమారెడ్డి, రాగిణి, గౌతంరాజు, జంక్షన్ రమేష్ తదితరులు నటిస్తున్నారు. సురేష్ మాటలు, ఇ.ఎస్.ఎన్.ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ప్రకాష్ ఫైట్స్, శ్రీనివాస రెడ్డి ఎడిటింగ్, రాజ్ కిరణ్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|