'కాస్కో' అంటున్న వైభవ్
వైభవ్ ('గొడవ' ఫేమ్) కథానాయకుడుగా కె.ఫిలింస్ బ్యానర్ పై సీనియర్ డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి సమర్పణలో ఎ.భారతి నిర్మిస్తున్న చిత్రానికి 'కాస్కో' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. వైభవ్ కు జోడిగా శ్వేతబసు ప్రసాద్ నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్టు కోదండరామిరెడ్డి తెలిపారు.
యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ, ఇందుకు తగ్గట్టుగా 'కాస్కో' అనే టైటిల్ ను నిశ్చయించామనీ ఆయన చెప్పారు. వైభవ్ కు ఈ చిత్రం మంచి పేరు తెస్తుందనీ, అలాగే గ్లామర్ తార శ్వేతబసు ప్రసాద్ ప్రేక్షకులను అలరిస్తుందనీ చెప్పారు. బ్రహ్మానందం పాత్ర పూర్తి వినోదాన్ని అందిస్తుందన్నారు. దర్శకుడు నాగేశ్వరరెడ్డి ఎంతో బాగా ఈ చిత్రాన్ని తీర్దిదిద్దారనీ, ఇందులోని ఐదు పాటల్లో రెండు పాటలు భారీ సెట్స్ లో తీశామనీ చెప్పారు. ఒక పాట చెన్నై బీచ్ లో, మరో రెండు పాటలు స్విట్జర్లాండ్ లో చిత్రీకరించినట్టు తెలిపారు. హైద్రాబాద్, వైజాగ్ లలో కూడా షూటింగ్ జరిపామన్నారు. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తన్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జయప్రకాష్ రెడ్డి, చలపతిరావు, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, సలీంబండా, టార్జాన్, ఆజాద్, ప్రదీప్ రావత్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి అగిలన్ సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్, సెల్వ, గణేష్ ఫైట్స్, ప్రేమ్ జీ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|