స్వర్ణోత్సవ నటుడు కమల్
ముద్దు ముచ్చట...వ్యక్తిగత జీవితం
ముద్దు సన్నివేశాలు లేకుండా కమల్ సినిమా చేయరనే కామెంట్లు కమల్ విషయంలో తరచు వినిపిస్తూ ఉంటుంది. అయినా కమల్ ఎప్పుడూ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. 'హేరామ్'లో రాణిముఖర్జీ, 'క్షత్రియపుత్రుడు'లో గౌతమి, 'భారతీయుడు'లో మనీషా కొయిరాలా, 'పోతురాజు'లో అభిరామి, 'మహానది'లో సుకన్య...వంటి వారితో కమల్ ముద్దు సన్నివేశాలు చేశారు. వ్యక్తిగత జీవితంలోనూ కమల్ పలుమార్లు ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కమల్ తొలివివాహం వాణి గణపతితో జరిగింది. కొన్నాళ్ల తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హిందీ నటి సారికను వివాహమాడారు. వీరికి శ్రుతి, అక్షర అనే సంతానం కలిగింది. కమల్-సారిక వైవాహిక బంధం కూడా విచ్ఛినమైంది. ప్రస్తుతం కమల్ నటి గౌతమితో సహజీవనం చేస్తున్నారు. కమల్ మాత్రం దీనిపై కామెంట్ చేయడానికి ఇష్టపడరు. ఇవన్నీ ఆయన నటనా ప్రాభవానికి ఎప్పుడూ అడ్డుకాలేదు. నటుడిగా ఐదు పదుల కెరీర్ లో ఆయన చేసిన ప్రయోగాలకు కొదవలేదు. మూకీ 'పుష్కక విమానం', మరుగుజ్జు 'విచిత్ర సోదరులు'...ఇలా చెప్పుకుంటూ వెళ్తే కమల్ తన సహనటులు, తర్వాత నటులకు కూడా చేయాడానికి ఏమీ మిగల్చలేదన్న రీతిలో విలక్షణ పాత్రలకు జీవం పోశారు.
కమల్ సర్ణోత్సవ సంబరాలను చెన్నై, కర్ణాటకలోని ఆయన అభిమాన సంఘాలు ఎంతో సంబరంగా జరుపుకొంటున్నారు. తొలుత చెన్నైలోనూ, ఆ తర్వాత ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈ మెగా సెలబ్రేషన్స్ జరిపేందుకు దక్షిణ భారత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|