జ్యోతిక నటవిశ్వరూపం 'ద్రోహి'
శరత్ కుమార్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందిన 'పచ్చైకేలీ ముత్తుచ్చెరం' చిత్రం తెలుగులో 'ద్రోహి' పేరుతో అనువాదమైంది. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకుడు. ఎస్.వి.ఆర్. పతాకంపై నిర్మాతలు రమణ, సింహ నీరజ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ శుక్రవారంనాడు విడుదల చేయనున్నట్టు సంస్థ ప్రతినిధుల్లో ఒకరైన శోభారాణి తెలిపారు. సోమవారంనాడు సంస్థ కార్యాలయంలో ఆ వివారాలను తెలియజేశారు.
తమిళంలో ఈ చిత్రం మంచి హిట్ అయిందనీ, ఇందులో జ్యోతిక నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూడవచ్చనీ చెప్పారు. జ్యోతిక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించారనీ, శరత్ కుమార్ రోరింగ్ ఫెర్ఫారమెన్స్ ప్రదర్శించారనీ తెలిపారు. హేరిస్ జైరాజ్ అందించిన సంగీతం, అరవింద్ కృష్ణ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని అన్నారు. మంచి చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు గతంలో వచ్చిన అనువాద చిత్రాల తరహాలోనే దీనిని కూడా ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందని శోభారాణి అన్నారు.
Be first to comment on this News / Article!
|