'రోబో' పాటలు లీకయ్యాయి!
'శివాజీ' కాంబినేష్ ను రిపీట్ చేస్తూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో రూపొందుతున్న 'రోబో' (యంత్రం) చిత్రం మరోసారి లీకేజీవీరుల బారిన పడింది. శంకర్ షూటింగ్ సమయంలో యూనిట్ సభ్యుల సెల్ ఫోన్లు అనుమతించకపోవడం, గుర్తింపు కార్డులు ఇవ్వడం వంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పాటిస్తున్నప్పటకీ ఆమధ్య విదేశాల్లో రజనీ-ఐశ్వర్యారాయ్ జంటపై చిత్రీకరించిన ఓ పాటకు సంబంధించిన స్టిల్స్ నేరుగా ఇంటర్నెట్స్ లోకి, అట్నించి అటు ప్రింట్ మీడియాకి చేరిపోయారు. దీంతో షాక్ తిన్న శంకర్ మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. ఇంత చేసినా ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలు 'యూట్యూబ్'లో ప్రత్యక్షమయ్యాయి. నాలుగు నిమిషాల ఫూటేజ్ తో రజనీ, ఐశ్వర్య కొంతమంది డాన్సర్లతో కలిసి రిహార్సల్స్ చేస్తున్నట్టు ఇందులో కనిపిస్తుంది.చక్కిటి సౌండ్, విజువల్ క్లారిటీతో ఈ పాటలు ఉండటం నెటిజన్స్ ను ఉర్రూతలూగిస్తున్నట్టు తెలుస్తోంది. యూట్యూబ్ కు ఇంతవరకూ 13,000 హిట్స్ కూడా వచ్చాయట.
ఆస్కార్ అవార్డు గ్రహిత ఎ.ఆర్.రెహమాన్ 'రోబో' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా రెండు పాటల లీకేజీపై రజనీకాంత్, శంకర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనీ, లీకేజీ వీరుల కోసం ఆరా తీస్తున్నారనీ తెలుస్తోంది. తాజా పరిణామాల దృష్ట్యా ఇవే సాంగ్స్ ను సినిమాలో కంటిన్యూ చేస్తారా, మార్పులు చేర్పులు ఉండబోతోయా అనేది వేచిచూడాల్సి ఉంటుంది.
Be first to comment on this News / Article!
|