'మానవతావాది' లారెన్స్
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవేంద్ర లారెన్స్ కు తమిళనాడు ప్రభుత్వం 'మానవతావాది' (హ్యూమనిటేరియన్) అవార్డును ప్రకటించింది. స్వాంతత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారంనాడు చెన్నైలో ముఖ్యమంత్రి కరుణానిధి చేతుల మీదుగా లారెన్స్ ఈ అవార్డును అందుకోబోతున్నారు. నిరుపేదలు, నిరాశ్రయులైన వారికి లారెన్స్ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేయనున్నారు.
లారెన్స్ కు నృత్యదర్శకుడిగానే కాకుండా మానవతావాదిగా కూడా తమిళనాట మంచి పేరుంది. లారెన్స్ తన ఛారిటబుల్ ట్రస్టు ద్వారా నిరుపేదలైన పిల్లలకు ఆశ్రయమిస్తున్నారు. వికలాంగుల యువకుల్లోని టాలెంట్ ను ప్రోత్సహిస్తూ ఏటా వారి చేత ప్రత్యేక ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. హృద్రోగ వ్యాధిగ్రస్తులకు చేయూతనిస్తూ, ఏటా పలువురు చిన్నాలకు హృద్యోగ శస్త్ర చికిత్సలకు ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇంతవరకూ 60 మందికి పైగా బాధితులకు శస్త్రచికిత్సలకు ఆయన సహాయం చేశారు. తాను చేపట్టిన సమాజ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అవార్డును ప్రకటించిన కరుణానిధికి లారెన్స్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ తన సేవా కార్యక్రమాలను కొనగిస్తానని చెప్పారు.
Be first to comment on this News / Article!
|