నాగ్ మేకప్ మన్ తో అనుష్క
యువసామ్రాట్ నాగార్జునకు చాలా కాలంగా మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న చంద్ర ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్ పై ఆయన తొలిసారి నిర్మించనున్న చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటించనుంది. ఇది హీరోయిన్ ఓరియెంటెండ్ కథా చిత్రంగా ఉండబోతోంది. ఆసక్తికరంగా నాగార్జున 'సూపర్' చిత్రంతోనే అనుష్క తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
నాగార్జునతో పనిచేసిన 'సీతారామరాజు', 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' చిత్రాలకు గాను గతంలో ఉత్తమ మేకప్ మన్ గా నంది అవార్డును చంద్ర అందుకున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో అనుష్కను చంద్ర సంప్రదించగానే ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం అనుష్క తెలుగులో రెండు, తమిళంలో ఒక చిత్రంలో నటిస్తోంది. మహేష్ తో నటిస్తున్న 'వరుడు', దర్శకుడు క్రిష్ 'వేదం', తమిళంలో విజయ్ సరసన నటిస్తున్న మరో చిత్రం నిర్మాణంలో ఉన్నాయి. గోపీచంద్ తో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న తదుపరి చిత్రానికి కూడా కమిట్ అయింది. ఈ నేపథ్యంలో చంద్ర నిర్మించనున్న చిత్రం డిసెంబర్ 11న ప్రారంభమవుతుందనీ, 2010 ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందనీ తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా ఓ యువదర్శకుడు పరిచయం కాబోతున్నారు.
Be first to comment on this News / Article!
|