ఎన్టీఆర్ 'బృందావనం' షురూ
ఎన్టీఆర్ కథానాయకుడుగా దిల్ రాజు నిర్మిస్తున్న 'బృందావనం' చిత్రం షూటింగ్ అన్నపూర్ణా స్టూడియోస్ లో మొదలైంది. దీనికి 'గోవిందుడు అందరి వాడేలే' అనే ట్యాగ్ లైన్ ఉంది. పైడిపల్లి వంశీ ('మున్నా' ఫేమ్) దర్శకుడు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి అక్కినేని నాగార్జున క్లాప్ ఇచ్చారు. వి.వి.వినాయక్ కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎస్.ఎస్.రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర సహ నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్ సైతం పాల్గొన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ, తమ సంస్థ నుంచి వస్తున్న 11వ చిత్రమిదనీ, 'దిల్' సినిమా నుంచీ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని అనుకున్నప్పటికీ సరైన కథ కోసం వేచిచూడాల్సి వచ్చిందనీ చెప్పారు. వంశీ తయారు చేసిన కథ ఎన్టీఆర్ కు బాగా సరిపోతుందని, ఎన్టీఆర్ కూడా కథ విని చాలా ఎగ్జయిట్ అయ్యారనీ అన్నారు. మంచి కథ, హీరో, ప్రతిభావంతులైన టెక్నీషియన్లు ఈ చిత్రానికి ప్రధాన బలమని చెప్పారు. తమన్ సంగీత దర్శకత్వంలో ఇప్పటికే ఐదు పాటలు రికార్డు చేశామనీ, అక్టోబర్ లో 10 రోజులు, డిసెంబర్ లో 'బందావనం' హౌస్ సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తామని చెప్పారు. సమ్మర్ కానుకగా రిలీజ్ ఉంటుందన్నారు. తన సొంత సంస్థ లాంటి దిల్ రాజు బ్యానర్ లో పనిచేస్తుండటం, కథ వినగానే ఎన్టీఆర్ ఓకే చేయడం చాలా సంతోషంగా ఉందని వంశీ పైడిపల్లి తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే గట్స్ తో ఉన్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో శ్రీహరి, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ తదితరులు నటించనున్నారు. కొరటాల శివ మాటలు, ఛోటా కె నాయుడు సినిమా టోగ్రఫీ అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|