నాగచైత్యనతో మంజుల చిత్రం
యువసామ్రాట్ నాగార్జున తనయుడు నాగచైతన్య తొలిచిత్రమైన 'జోష్' విడుదలకు సిద్ధమవుతోంది. దీనికంటే ముందే ఆయన రెండో చిత్రం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ప్రారంభమైంది. ఇందిరా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మంజుల, సంజయ్ సర్వూప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నపూర్ణా స్టూడియోస్ లో ఈ చిత్రం ప్రారంభమైంది. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, విజయనిర్మల, నాగార్జున, నాగచైతన్య, మంజుల, గౌతమ్ మీనన్, సంజయ్ స్వరూప్ తదితురలు పాల్గొన్నారు. దైవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి కృష్ణ క్లాప్ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. డి.రామానాయుడు గౌరవ దర్శకత్వం వహించారు.
నాగచైత్యన తొలి చిత్రం విడుదల కాకుండానే మలిచిత్రానికి అంగీకరించడానికి ప్రధాన కారణం ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకుడు కావడమేనని నాగార్జున తెలిపారు. సరికొత్త కథాంశంతో చైతన్య కెరీర్ లో గుర్తుండిపోయే విధంగా ఈ చిత్రం ఉటుందన్నారు. ఏ.ఆర్.రెహమానమ్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం అవుతుందని చెప్పారు. కృష్ణ మాట్లాడుతూ, అక్కినేని నాగేశ్వరరావుతో 'హేమాహేమీలు', 'రాజకీయ చదరంగం' వంటి చిత్రాలు తీశాననీ, నాగార్జునతో 'వారసుడు'లో నటించాననీ, ఇప్పుడు అక్కినేని మూడో తరం వారసుడితో తమ సంస్థ సినిమా రూపొందిస్తుడటం సంతోషంగా ఉందనీ అన్నారు. తనపైన ఉన్న నమ్మకంతో నాగార్జున ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాననీ, చైతన్యకు బాగా సూటయ్యే కథ ఇదనీ మంజుల తెలిపారు. గౌతమ్ మీనన్, రెహ్మాన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని ఇచ్చిన మంజుల-శాంతి స్వరూప్ దంపతులకు చైతన్య కృతజ్ఞతలు తెలిపారు. రెండు పెద్ద సినిమా కుటుంబాల నుంచి వస్తున్న ఈ సినిమాకి తాను దర్శకుడు కావడంతో తన బాధ్యత మరింత పెరిగిందని గౌతమ్ మీనన్ పేర్కొన్నారు. సంగీతానికి మంచి ప్రాధాన్యం ఉన్న సినిమా ఇదనీ, హీరోయిన్ ఎంపిక జరుగుతోందనీ చెప్పారు. హైద్రాబాద్, కేరళ, న్యూయార్క్ లలో షూటింగ్ పూర్తి చేస్తామని చెప్పారు. డిసెంబర్ లో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి మనోజ్ సినిమాటోగ్రఫీ, రాజావన్ కళాదర్శకత్వం, ఆంథొని ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|