కల్యాణ్ రామ్ సినిమా ప్రోగ్రస్
'అతనొక్కడే', 'హరేరామ్' చిత్రాల తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ మరోసారి తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న తృతీయ చిత్రం హైద్రాబాద్ లో శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. కల్యాణ్ రామ్ సరసన హన్సిక కథానాయికగా నటిస్తోంది. నరేన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రం ప్రోగ్రస్ ను కల్యాణ్ రామ్ తెలియజేస్తూ, ఇప్పటికే రెండు షెడ్యూల్స్ జరుపుకొన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ జరుపుకొంటోందని చెప్పారు. తమ సంస్థలో వచ్చిన రెండు చిత్రాలు వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ ప్రేక్షకాదరణ చూరగొన్నాయనీ, ఈ చిత్రం కూడా వాటికి మించే స్థాయిలో రూపొందుతోందనీ తెలిపారు. కల్యాణ్ రామ్ ఇందులో డిఫరెంట్ రోల్ చేస్తున్నట్టు దర్శకుడు నరేన్ తెలిపారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో చిత్రం తెరకెక్కుతోందనన్నారు. కల్యాణ్ రామ్ కెరీర్ లో ఇదో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ఆలీ, రఘుబాబు, వేణుమాధవ్, చలపతిరావు, సుధ, హేమ తదితరులు నటిస్తున్నారు. బి.వి.ఎస్.రవి కథ-మాటలు, దాశరధి సినిమాటోగ్రఫీ, ఎస్.థామన్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|