ఉదయ్ కిరణ్-శ్వేత ప్రేమకథ
ఉదయ్ కిరణ్, శ్వేత బసు ప్రసాద్ జంటగా రూపొందనున్న కొత్త చిత్రం స్క్రిప్టు పూజా కార్యక్రమాలు హైద్రాబాద్ లోని సాయిబాబా ఆలయాంలో ఆదివారం జరిగాయి. సోమా విజయప్రకాష్ నిర్మాణ సారథ్యంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఫిలింస్ పతాకంపై డి.కుమార్, ఈశ్వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుభాసెల్వం దర్శకుడు.
ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, హీరోగా తన సెకెండ్ ఇన్నింగ్స్ కు ఇది మంచి నాంది అవుతుందనీ, సున్నితమైన ప్రేమకథకు అన్ని కమర్షియల్ అంశాలు జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారనీ తెలిపారు. అన్ని వర్గాల అలరించే అంశాలతో ఈ చిత్రం ఉంటుందనీ, ఉదయ్ కిరణ్ కెరర్ లో ది బెస్ట్ మూవీ అవుతుందనీ నిర్మాతలు తెలిపారు. ఈనెల 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. ఈ చిత్రానికి జనార్థన్ మహర్షి మాటలు, రాఘువన్ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ కోనేరు సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|