'బ్రహ్మలోకం టు యమలోకం'
డాక్టర్ రాజేంద్రప్రసాద్, శివాజీ, ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం 'బ్రహ్మలోకం టు యమలోకం'. యుతోపియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో లక్కీ మీడియా పతకాంపై బెక్కం వేణుగోపాల్, రుపేష్ డి. గోహిల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రచయిత గోళ్లపాటి నాగేశ్వరరావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ ఆదివారంనాడు ప్రారభంమైంది. ముహూర్తం సన్నివేశానికి డాక్టర్ డి.రామానాయుడు క్లాప్ ఇవ్వగా, భూమిక-భరత్ ఠాగూర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అల్లరి నరేష్ గౌరవ దర్శకత్వం వహించారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రేక్షకులను ఒక లోకం నుంచి మరో లోకానికి తీసుకువెళ్తుందనీ, ఇందులో తాను బ్రహ్మదేవుడిగా నటిస్తున్నాననీ చెప్పారు. కాంలంతో పాటు దేవుడు కూడా మారాలనే వినూత్న కథాంశంతో ఈ చిత్రం ఉంటుందన్నారు. గతంలో రాజేంద్రప్రసాద్, తానూ నటించిన 'శ్రీరామచంద్రులు', 'సందడే సందడి' హిట్టయ్యాయనీ, ఈ చిత్రంతో తాము హ్యాట్రిక్ సాధిస్తామనే నమ్మకం ఉందనీ శివాజీ తెలిపారు. ఇందులో రంభగా ఆర్తి అగర్వాల్ నటిస్తోందన్నారు. ఇది పూర్తి వినోదాత్మక చిత్రమని సోమా విజయప్రకాష్ చెప్పగా, సోషియో ఫాంటసీ సినిమాకి సంగీతం అందించాలనే కోరిక ఈ చిత్రంతో తీరనుందని సంగీత దర్శకురాలు శ్రీలేఖ తెలిపారు. దర్శకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ, తాను 'అఆఇఈ' చిత్రానికి మాటలు అందించారననీ, ఈ చిత్రానికి తాను తయారు చేసిన కథ నచ్చి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలనీ అన్నారు. బ్రహ్మదేవుడి పాత్రకు రాజేంద్రప్రసాద్ అయితే బాగుంటుందని అనుకోవడం, ఆయన అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో అద్భుతమైన ప్రేమకథ కూడా ఉందని చెప్పారు. సెప్టెంబర్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామని తెలిపారు.
Be first to comment on this News / Article!
|