అక్కినేనికి టిఎస్సార్ అవార్డు
ప్రముఖ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుకు టి.సుబ్బరామిరెడ్డి కళాపీఠం మిలీనియం అవార్డు వరించింది. టి.సుబ్బరామిరెడ్డి (టిఎస్సార్) కళాపీఠం-2009 పురస్కారాల విజేతలను తాజ్ బంజారాలో జరిగిన కార్యక్రమంలో అవార్డుల కమిటీ చైర్మన్ డి.రామానాయుడు ప్రకటించారు. టి.సుబ్బరామిరెడ్డి, జమున, పి.సుశీల, ఆర్.వి.రమణమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతీయ సమైక్యతా అవార్డుకు వైజయంతీ మాల, లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుకు డాక్టర్ సి.నారాయణరెడ్డి, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఎం.పి. హమ్మద్ అజార్దుద్దీన్, కళాసరస్వతి అవార్డుకు డాక్టర్ జయసుధను ఎంపిక చేశారు. సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని సుబ్బరామిరెడ్డి తెలిపారు. అలాగే సెప్టెంబర్ 16న తిరుపతి, షిర్డీ, మధురై తదితర ప్రధాన దేవాలయ్యాలోని పూజారులను సత్కరిస్తామనీ, కర్ణాటక సంగీతానికి విశిష్ట సేవలందిస్తున్న నేదునూరి కృష్ణమూర్తిని స్వర్ణకంకణంతో ఘనంగా సన్మానిస్తామనీ చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెప్టెంబర్ 11 నుంచి 15 వరకూ విశాఖలో లక్ష్మీచండీ యాగం, వరుణ యాగం నిర్వహిస్తామని చెప్పారు. ఏ వృత్తిలో ఉన్నా కళకు దగ్గరగా ఉంటూ కళాకారులను సన్మానిస్తూ ఆనందిస్తుంటాడని సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. కళాపీఠం-2009 అవార్డుల ఎంపిక కమిటీకి డి.రామానాయుడు అధ్యక్షుడుగా వ్యవహరించగా, జమున, శారద, సుశీల సభ్యులుగా వ్యవహరించారు.
Be first to comment on this News / Article!
|