స్నేహను వేధించిన వ్యక్తి అరెస్టు
ఆందాల నటి స్నేహకు తరచు తప్పుడు మెసేజ్ లు పెంచుతూ సెక్సువల్ వేధింపులకు పాల్పడుతున్నాడనే అభియోగంపై బెంగుళూరుకు చెందిన 35 ఏళ్ల రియాల్టర్ రాఘవేంద్రను చెన్నై సిటీ పోటీసులు అదుపులోనికి తీసుకున్నారు. ప్రతిరోజూ తనను పెళ్లి చేసుకోమంటూ లెక్కకు మించిన ఎస్ఎంఎస్ లతో వేధిస్తున్నాంటూ స్నేహ ఇటీవల సిటీ పోలీస్ కమిషనర్ టి.రాజేంద్రన్ కు ఫిర్యాదు చేసింది.
టి.నగర్ లోని ఓ స్టార్ హోటల్ లో రాఘవేంద్రను కలుసు కొమ్మని స్నేహ చెప్పినట్టుగా పబ్లిసిస్ట్ జాన్, స్నేహ అంకుల్ సురేష్ కలిసి పోలీసుల సహకారంతో ఓ మెసేజ్ రాఘువేంద్రకు పంపారనీ, దీంతో రాఘువేంద్ర నేరుగా పోలీసుల వలలో చిక్కాడనీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై స్నేహ స్పందిస్తూ, రాఘువేంద్ర అనే వ్యక్తి గత ఎనిమిది నెలలుగా తనను వేధిస్తున్నమాట నిజమేననీ, తన తండ్రిని కలిసి 'ఆటోగ్రాఫ్-2' చిత్రాన్ని తీయాలనుకుంటున్నట్టు చెప్పాడనీ ఆమె పేర్కొన్నారు. అయితే చరణ్ ను సంప్రదించాల్సిందిగా తన తండ్రి అతనికి సూచించారనీ, ఆ తర్వాత నుంచి రాఘువేంద్ర తనను పెళ్లి చేసుకోమంటూ ఎస్.ఎం.ఎస్.లు పంపుచూ, షూటింగ్ లొకేషన్లకూ వచ్చి తనను ఫాలో అయ్యేవాడని పేర్కొంది. ఆ తర్వాత బెదరింపులకు కూడా పాల్పడుతుండటంతో పోలీసులను సంప్రదించినట్టు చెప్పారు. ఎట్టకేలకు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (సైబర్ క్రైమ్ సెల్) డాక్టర్ ఎం.సుధాకర్ నేతృత్వంలోని పోలీసు బృందం రాఘవేంద్రను అదుపులోనికి తీసుకుంది.
Be first to comment on this News / Article!
|