పవన్ 'మిస్టర్ పెర్ ఫెక్ట్'
'జల్సా' విడుదలై 16 నెలలు గడిచినా ఇంతవరకూ పవన్ కల్యాణ్ కొత్త చిత్రం ఏదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. నిజానికి ఎస్.జె.సూర్య దర్శకత్వంలో 'కొమురం పులి' చిత్రం గత ఏడాదే ప్రారంభమైనప్పటికీ కారణాంతరాల వల్ల షూటింగ్ లో పలుమార్లు అంతరాయాలు తలెత్తాయి. ప్రస్తుతం ఈ చిత్రం 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రోగ్రస్ లో ఉంది. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తర్వాత పవన్ కథానాయకుడుగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై గణేష్ బాబు ('ఆంజనేయులు' ఫేమ్) ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. హరీష్ శంకర్ ను దర్శకుడిగా ఇప్పటికే ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం పవన్ మరో కొత్త చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది 'కిక్ ' వంటి హిట్ చిత్రాన్ని అందించన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం.
సురేందర్ రెడ్డి చెప్పిన స్టోరీలైన్ పవన్ కు నచ్చిందనీ, మరింత డవలప్ చేయాల్సిందిగా సూచించారనీ తెలుస్తోంది. పవన్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మించనున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయకుడుగా గుణశేఖర్ దర్శకత్వంలో డివివి దానయ్య ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, పవన్ 'కొమురం పులి' పూర్తి కాగానే గణేష్ బాబు చిత్రం, కొద్ది గ్యాప్ తో సురేందర్ రెడ్డి చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పవన్-సురేందర్ రెడ్డి చిత్రానికి 'మిస్టర్ పెర్ ఫెక్ట్ ' అనే టైటిల్ ను అనుకుంటున్నారు.
Be first to comment on this News / Article!
|