చవితికి 'బాణం' పాటలు
మూడు దశాబ్దాలుగా భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరున్న వైజయంతీ మూవీస్ సంస్థకు అనుబంధంగా సి.అశ్వనీదత్ కుమార్తెలు 'త్రీ ఏంజెల్స్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో కొత్త సంస్థను స్థాపించి తొలిసారిగా నిర్మించిన చిత్రం 'బాణం'. నారా చంద్రబాబునాయుడు సోదరుడైన రామ్మూర్తి నాయుడు తనయుడు నారో రోహిత్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. వేదిక హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ పాత్రికేయుడు, రచయిత నారాయణమూర్తి కుమారుడు దంతులూరి చైతన్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈనెల 23న వినాయక చవితి పండుగ సందర్భంగా వినూత్న శైలిలో ఈ చిత్రం ఆడియోను విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సినిమాలోని ఆరు పాటల్లో నాలుగు పాటలు నాలుగు న్యూస్ ఛానెల్స్ ద్వారా విడుదల చేయబోతున్నారు. నారా చంద్రబాబునాయుడు, బాలకృష్ణ చేతులమీదుగా చెరో పాట విడుదలవుతుంది.
'త్రీ ఏంజెల్స్' సంస్థ తొలి చిత్రంగా రూపొందుతున్న 'బాణం' ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నామనీ, సెప్టెంబర్ 16న సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామనీ నిర్మాత శేషు ప్రియాంక తెలిపారు. ఈ చిత్రానికి నాగరాజు మాటలు, రామజోగయ్యశాస్త్రి పాటలు, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|