లీగల్ సెల్ ముందు చరణ్
'మగధీర' చిత్రంలో లాయర్లను కించపరచే విధంగా సన్నివేశాలు చిత్రీకరించారనీ, లాయర్ల మనోధైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేశారంటూ మచిలీపట్నం లీగల్ సెల్ లో అడ్వకేట్ బాలాజీ వేసిన ప్రజాప్రయోజనాల వాజ్యం విషయంలో రామ్ చరణ్ లీగల్ సెల్ ముందు హాజరుకావడం అనివార్యం కానుంది. సినిమాలో లాయర్లను కించపరచే విధంగా చూపించిన సన్నివేశాలు తొలిగించాలని బాలాజీ వేసిన వ్యాజ్యంపై రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత అల్లు అరవింద్ కు ఇప్పటికే లీగల్ సెల్ నోటీసులు జారీచేసింది. ఈనెల 18న కోర్టుకు హాజరు కావాల్సిందిగా కూడా ఆదేశించింది. 'మగధీర' టీమ్ తరఫు అడ్వేకేట్ మంగళవారంనాడు విశాఖ లీగల్ సెల్ ముందు హాజరయ్యారు. తన క్లయింట్స్ రామ్ చరణ్, రాజమౌళి, అల్లు అరవింద్ లను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని సెల్ చైర్మన్ ను ఆయన కోరారు. ఇందుకు సెల్ చైర్మన్ నిరాకరిస్తూ సెప్టెంబర్ 10న తప్పనిసరిగా వారంతా కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేశారు. దీంతో రామ్ చరణ్ ఆరోజు కోర్టు ముందు హాజరుకావడం తప్పనిసరి కానుంది.
'మగధీర' చిత్రంలో విలన్ కు వ్యతిరేకంగా కేసు చేపట్టిన ఓ లాయర్ ను విలన్ పారిపొమ్మని చెప్పి వెనుక నుంచి బరిసె విరిసి చంపుతాడు. ఆ బరిసె వెన్నులోంచి పొట్టలోకి దూసుకుపోతుంది. ఈ సన్నివేశం లాయర్ల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తోందనీ, వెంటనే సన్నివేశాన్ని తొలిగించాలని లాయర్ బాలాజీ తన వ్యాజ్యంలో కోరారు.
Be first to comment on this News / Article!
|