'జగద్గురు బాబా'కి ప్రశంసలు
మతసామరస్యం, శాంతి, ప్రేమతత్వాన్ని మానవాళికి ప్రబోధించిన షిర్డీ సాయిబాబు ఇతివృత్తంలో 'జగద్దురు శ్రీ షిర్డీ సాయిబాబా' చిత్రం రూపొందింది. ఎస్.ఆర్.ఆర్.క్రియేషన్స్ పతాకంపై జి.రామకృష్ణ దర్శకత్వంలో బి.వి.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. షిర్డీ సాయిబాబా పాత్రను కూడా బి.వి.రెడ్డి సోషించారు. ఈ చిత్రాన్నిఆయన సోమవారం సాయంత్రం మీడియాకు ప్రదర్శించారు.
బి.వి.రెడ్డి మాట్లాడుతూ, ప్రముఖ నటుడు మోహన్ బాబు, దర్శకుడు బి.గోపాల్ ఈ చిత్రాన్ని చూసి ఎంతో బాగుందంటూ ప్రశంసించారని తెలిపారు. సాయిబాబా దైవస్వరూపం మాత్రమే కాదనీ, గొప్ప సంఘ సంస్కర్త అనీ, సామాజిక రుగ్మతలను మాపడంలో ఆయన అవిరళ కృషి చేశారనీ అన్నారు. ఈ ఘట్టాలను ఈ చిత్రంలో ఆవిష్కరించామనీ, షిర్డీ సాయిబాబాపై ఇంతవరకూ వచ్చిన చిత్రాలను భిన్నంగా కొత్తకోణంలో దీనిని మలిచామనీ చెప్పారు. బాబాగా నటించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ రెండోవారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నాగబాబు, సుమన్, శివకృష్ణ, బ్రహ్మాజీ, నారాయణరావు, రఘునాథరెడ్డి, రామిరెడ్డి, కోట శంకరరావు, సత్యారెడ్డి, గుండు హనుమంతరావు, హేమసుందర్, శివప్రసాద్, రమాప్రభ తదితరులు నటించారు. కొమ్మనాపల్లి గణపతిరావు మాటలు, అశోక్ తేజ-పరిమి రామ నరసింహం-తైదల బాపు పాటలు, శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, మేనగ శ్రీను ఎడిటింగ్, లలిత్ సురేష్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|