స్నేహ మార్ఫింగ్ ఫోటోలు సీజ్
స్నేహను ప్రేమించానంటూ అప్పట్లో ఓ భగ్న ప్రేమికుడు ఆమెతో తీయించుకున్న ఫోటోలు కూడా బయటపెట్టి ఆమెను చీకాకు పెట్టాడు. స్నేహ ఛీకొట్టడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఇప్పుడు మరో తలనొప్పి ఆమెను చుట్టుకుంది. స్నేహను ప్రేమిస్తున్నానంటూ గత ఎనిమిది నెలలుగా ఎస్ఎంఎస్ లు ఇస్తూ, చివరకు బెదరింపులకు కూడా దిగిన బెంగుళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాఘవేంద్రను రెండ్రోజుల క్రితం చెన్నై పోలీసు వలపన్ని పట్టుకున్నారు. స్నేహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని కటకటాలు వెనక్కి నెట్టారు. ప్రస్తుతం అతన్ని ఇంటరాగేట్ చేస్తున్న పోలీసులకు మరిన్ని ఆధారులు కూడా దొరికాయి. అతని కంప్యూటర్, సెల్ ఫోన్ నిండా స్నేహ ఫోటోలే ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. రాఘవేంద్రతో స్నేహ కలిసి ఉన్నట్టు కనిపించే కొన్ని మార్ఫ్ డ్ ఫోటులు, షూటింగ్ సమయాల్లో ఆమెకే తెలియకుండా తీసిన మరికొన్ని ఫోటోలు కూడా ఇందులో ఉన్నాయి. స్నేహకు అతను పంపిన మెసేజ్ లతో ఉన్న సెల్ ఫోన్ ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాఘవేంద్ర వద్ద దొరికిన ఆధారాలు, స్నేహకు ఇచ్చిన సంభాషణల ఆధారంగా సైబర్ క్రైమ్ అధికారులు తదుపరి దర్యాప్తు చేపడుతున్నారు. ఇందులో భాగంగా స్నేహను కూడా విచారించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అసలే కెరీర్ విషయంలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న స్నేహకు పిచ్చి ప్రేమికుల బెడద మరింత కలవరపెడుతోంది. కష్టకాలమంటే ఇదేనేమో?!
Be first to comment on this News / Article!
|