కాజల్ తో బన్నీ డ్యూయెట్
'మగధీర' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగ్వర్వాల్ ఇప్పుడు స్టైలిష్ హీరో అల్లు అర్జున్ తో కలిసి డ్యూయెట్లు పాడుతోంది. అయితే ఇది 'ఆర్య-2' సినిమా కోసమే. ఫీల్ మై లవ్...అంటూ అప్పట్లో 'ఆర్య' చిత్రంతో సందడి చేసిన అల్లు అర్జున్ మళ్లీ ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ తో 'ఆర్య-2'లో నటిస్తున్నారు. ప్రస్తుతానికి ఇదే టైటిల్ ప్రచారంలో ఉన్నా త్వరలోనే మరో టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ జోడిగా కాజల్ తొలిసారి నటిస్తున్న ఈ చిత్రంలో నవదీప్, శ్రద్ధాదాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై ఆదిత్యబాబు, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.
ఈనెల 19న గోవాలో అర్జున్-కాజల్ జంటపై నిక్సన్ నృత్య దర్శకత్వంలో ఓ పాట చిత్రీకరణ మొదలైంది. వారం రోజుల పాటు షూటింగ్ జరుగుతుంది. అనంతరం మరో పాట హైద్రాబాద్ లోని సెట్లో చిత్రీకరిస్తారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈనెలాఖరులో ఆడియో, సెప్టెంబర్ 19న ('మగధీర' 50 రోజులు పూర్తయిన మరుసటి రోజే) సినిమా విడుదలకు ప్లానింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|