'అద్దాలకోట'గా మిర్రర్స్
హాలీవుడ్ లో గత ఏడాది సంచలన విజయం సాధించిన 'మిర్రర్స్' చిత్రం ఇప్పుడు 'అద్దాలకోట' పేరుతో తెలుగులోకి అనువాదమవుతోంది. అద్విక ఎంటర్ ప్రైజెస్ పతాకంపై కె.వెంకటరెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. డబ్బింగ్, మిక్సింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తొలికాపీతో విడుదలకు సిద్ధమైంది.
హాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ సంస్థ 'మిర్రర్స్' చిత్రాన్ని అందించిందనీ, ప్రపంచ దేశాల్లో ఈ చిత్రం సంచలన విజయం సాధించిందనీ నిర్మాత వెంకటరెడ్డి తెలిపారు. ఉత్కంఠ భరితమైన సన్నివేశాలకు చక్కటి గ్రాఫిక్ వర్క్ కూడా ఈ చిత్రానికి హైలైట్ అవుతుందన్నారు. ఒక బంగాల్లో నివశిస్తున్న కుటుంబంపై ఆత్మ ప్రవేశించి వాళ్లను చిత్రహింసలు చేస్తూ చంపడం ఇందులోని ప్రధానాంశమనీ, సన్నివేశాలన్నీ మిస్టరీగా ఉంటాయనీ చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో కిఫర్ సుధర్ ల్యాండ్, క్యామ్ రన్ బైసీ, సౌలపేటాన్, ఎరికగ్లుక్ తదితరులు నటించారు. అలగ్రేండ్రేజ దర్శకత్వం వహించారు.
Be first to comment on this News / Article!
|