కర్నూలులో 'శంభో శివశంభో'
రవితేజ-ప్రియమణి జంటగా శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం 'శంభో శివశంభో'. తమిళంలో విజయవంతమైన 'నాడోడిగళ్' చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. సుముదిరకని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కీలక షెడ్యూల్ కు రెడీ అవుతోంది.
బెల్లంకొండ సురేష్ ఆ వివరాలను తెలియజేస్తూ, ఈనెల 16 నుంచి 19 వరకూ మూడు రోజుల పాటు హైద్రాబాద్ లో షూటింగ్ జరిపామనీ, 21 నుంచి కర్నాలులో షూటింగ్ చేయనున్నట్టు చెప్పారు. కర్నూలు, రాజమండ్రి, హైద్రాబాద్ లలో జరిపే నివరధిక షెడ్యూల్ తో సినిమా పూర్తి చేస్తామని తెలిపారు. తమిళంలో 'నాడోగిగళ్' చాలా పెద్ద హిట్ అనీ, ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన సముదిరకని ఈ చిత్రానికి కూడా దర్శకత్వం అందిస్తూ తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారనీ చెప్పారు. తమిళ చిత్ర సంగీత దర్శకుడు సుందర్ సి.బాబుకు తెలుగులో కూడా తెలుగులో ఇది తొలి చిత్రమవుతుందని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో అల్లరి నరేష్, శివబాలాజీ, సునీల్, రోజా, , కృష్ణ భగవాన్, ముఖేష్ రుషి, రాజారవీంద్ర, ఆహుతిప్రసాద్, జీవా, సుధ, కిన్నెర, సురేష్ తేజ్, ప్రవీణ్, చిత్రలేఖ, రాధాకుమారి తదితరులు నటిస్తున్నారు. శశాంక్ వెన్నెలకంటి మాటలు, చిన్నచరణ్ పాటలు, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, జి.ముత్తయ్య సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|