రాజేంద్రప్రసాద్ గిన్నెస్ దోస
నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ వెండితెరపై నవ్వులు పూయించడమే కాదు...గరిటె పడితే గిన్సెస్ రికార్డులు కూడా ఆలోవకగా తన ఖాతాలో వేసుకోగలరు. అహ్మదాబాద్ లోని సంకల్ప్ రెస్టారెంట్ లో రాజేంద్రప్రసాద్ స్యయంగా 31 అడుగుల దోసె వేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రపంచంలోనే ఇతి పెద్ద దోసె ఇదో కావడం విశేషం. ఇప్పటి వరకూ గిన్నెస్ రికార్డులో 30 అడుగుల దోసె రికార్డును రాజేంద్రప్రసాద్ బ్రేక్ చేశారు. 40 నిమిషాల వ్యవధిలో రాజేంద్రప్రసాద్ చేసిన ఈ ఫీట్ కు 16 మంది వంటగాళ్లు సహకరించారు. రాజేంద్రప్రసాద్ దోసె తయారీ వెనుక అసలు కథ ఏమిటంటే...ప్రస్తుతం ఆయన హీరోగా ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 'క్విక్ గన్ మురుగన్' చిత్రం రూపొందుతోంది. ఫ్యాక్ స్టార్ స్టూడియో సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో ఫ్యాట్ ఫిష్ ఫిలిమ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్ వర్గ్ లో భాగంగానే రాజేంద్రప్రసాద్ 'కుక్' గన్ (గిరిటె) తిప్పి దోసె వేశారన్నమాట.
శాఖాహారం గొప్పతనం తెలియచెప్పే చిత్రమిదనీ, ఇందులో భాగంగానే రాజేంద్రప్రసాద్ తో దోసె తయారు చేయించామనీ ఫ్యాక్ స్టార్ స్టూడియో ప్రతినిధి వివేక్ కృష్ణాని తెలిపారు. శాఖాహారం కోసం పోరాడే సాంబార్ కౌబాయ్ గా రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. ఈ కౌబాయ్ ను వ్యతిరేకిస్తూ మాంసాహారమే మిన్న అంటూ లాయర్లు పోరాటం చేస్తుంటారు. శాఖాహార ప్రియులకూ, మాంసాహారాన్ని ఇష్టపడే వారికి మధ్య జరిగే పోరాటం వినోదాత్మకంగా ఉంటుందని తెలిపారు. ఇందులో మాంగోడాలీగా రంభ ద్విపాత్రాభినయం చేస్తోంది.
Be first to comment on this News / Article!
|