'ఈనాడు'లో కమల్ పాట
పాపులర్ హీరోలు అడపాదడపా తమ సొంత గొంతుతో పాటలపాడి అభిమానులను ఉర్రూతలూగిస్తుంటారు. ఈ శుక్రవారమే విడుదలకు సిద్ధమవుతున్న 'మల్లన్న' చిత్రంలో విక్రమ్ తొలిసారిగా నాలుగు పాటలు పాడారు. విలక్షణ నటుడు పద్మశ్రీ కమల్ హాసన్ గతంలో అడపాదడపా పాటల్లో తన వాయిస్ వినిపించినప్పటికీ ప్రస్తుతం అంతా ఎదురుచూస్తున్న 'ఈనాడు' చిత్రం కోసం తాజాగా ఓ పాట పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతున్నారు. ఈ చిత్రం తమిళంలో 'ఉన్నైపోల్ ఒరువన్' పేరుతో విడుదల కానుంది. తెలుగు వెర్షన్ లో కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్, తమిళ వెర్షన్ లో కమల్, మోహన్ లాల్ నటిస్తున్నారు. చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో విజయవంతమైన 'ది వెన్స్ డే' రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది.
కమల్ నటుడుగా 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ ద్విభాషా చిత్రంపై ప్రేక్షకులలో మంచి ఆసక్తి నెలకొని ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకునే కమల్ ఈ చిత్రంలో ఓ పాటకు నేపథ్యగానం అందించారు. గత వారం చెన్నైలోని కోదండపాణి రికార్డింగ్ స్టూడియోలో ఈ పాటను రికార్డు చేశారు. గానగంధర్వ ఎస్.పి.బాలసుబ్రమణ్యం సొంత రికార్డింగ్ స్టూడియో ఇది. కమల్ పాటకు ఆమె కుమార్తె, చిత్ర సంగీత దర్శకురాలు శ్రుతి హాసన్ సంగీతం అందించడం విశేషం. ఈ నెలలోనే ఆడియో విడుదల చేసి, సెప్టెంబర్ 18న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. యుటీవీ, రాజ్ కమల్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో వెర్షన్ రిలీజ్ హక్కులను అమ్మ ఆర్ట్స్ క్రియేషన్ అధినేత జి.కుమార్ బాబు సొంతం చేసుకున్నారు.
Be first to comment on this News / Article!
|