కిరణ్ రాథోడ్ 'హైస్కూలు'
కిరణ్ రాథోడ్, మాస్టర్ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నరసింహ నంది దర్శకత్వంలో ఐశ్వర్య ఫిలింస్ పతాకంపై మల్లన్న నిర్మిస్తున్న చిత్రానికి 'హైస్కూలు' అనే టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రం తొలిషెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండు పాటలతో సహా 90 శాతం టాకీ పార్ట్ పూర్తయినట్టు చిత్ర దర్శకనిర్మాతలు తెలిపారు.
సినిమా ఏకబికిన ఈనెల 8వ తేదీ వరకు తొలి షెడ్యూల్ జరుపుకొన్నట్టు దర్శకుడు నంది తెలిపారు. 13 సంవత్సరాల అబ్బాయి, 30 సంవత్సరాల అమ్మాయి మధ్య సాగే ప్రేమకథతో ఈ చిత్రం ఉంటుందన్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలోని సన్నివేశాలు చాలా బాగా వచ్చాయన్నారు. ఈ గురువారం నుంచే రెండో షెడ్యూల్ మొదలైందనీ, ఇదే షెడ్యూల్ లో షూటింగ్ పార్ట్ పూర్తవుతుందనీ నిర్మాత మల్లన్న తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో తిలక్, రాగిణి, జెన్నీ, గౌతంరాజు, మల్లిక, చంద్ర, సుదర్శన్, రంగి తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం నరసింహ నంది అందిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్ సినిమాటోగ్రఫీ, సాకేత్ సాయిరామ్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|