మల్లన్న' రివ్యూ
'అపరిచితుడు' తరహాలోనే హీరో మారు వేషాలు వేయడం, ప్రజల కోర్కెలు తెలుసుకుని సహాయంచేయడం, మారు వేషాల్లో తిరగడం, పోలీస్ ఆఫీసర్ ఛేజింగ్ వంటివి ఇందులోనూ ఉండటం చూస్తే సుశీ గణేషన్ పై శంకర్ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఏ ఫ్రేమ్ కూడా ఒకటి రెండు సెకెండ్లకు మించి కనపించకపోవడం ఎడిటింగ్ శాఖపై దర్శకుడి పెత్తనంగానే కనిపిస్తుంది. ఇందువల్ల చూసే కంటికి శ్రమ పెరుగుతుంది. మెక్సికోలో తీసిన సన్నివేశాలు రిచ్ గా ఉన్నా కలడ్ గ్రేడేషన్ అడపాదడపా పాలిపోయినట్టు కనిపిస్తుంది. దర్శకుడు సినిమాలో మూడు చోట్ల వేర్వేరు టైటిల్ కార్డ్ లు వేయించుకోవడంతో పాటు ఓ చిన్న పాత్రలో కూడా నటించారు.
చియాన్ విక్రమ్ మరోసారి 'అపరిచితుడు'ను గుర్తు చేశారు. ఇందులో కోడిపుంజును ఇమిటేట్ చేసిన తీరు బాగుంది. అలాగే ఆడవేషంలో వచ్చి తాగుబోతులను తన కదలికలతో తుక్కుగా తన్నడం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. విక్రమ్ డబ్బింగ్, నేపథ్యగానంతో కూడా అలరించారు. శ్రియ బహుశా తన కెరీర్ లోనే ఇంత గ్లామర్ గా ఎప్పుడూ కనిపించ లేదనే చెప్పాలి. భారీగా స్కిన్ షో చేయడంతో పాటు విక్రమ్ తో ఓ లిప్ కిస్ సన్నివేశంలోనూ నటించింది. గాలిలోకి ఎగిరి విక్రమ్ బైక్ మీదకు శ్రియ దూకే సన్నివేశం మాత్రం కృతకంగా ఉంది. విక్రమ్-శ్రియ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు కథాక్రమంలో కొంతవరకూ బాగానే ఉన్నా రానురానూ కథలోని వేగానికి స్పీడ్ బ్రేక్ లు పడుతుంటాయి. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా ప్రభు ఫరవాలేదు. సిబిఐ ఆఫీసర్ గా కృష్ణ డిగ్నిఫైగా చేశారు. ఆశిష్ విద్యార్థి పక్షవాతం వచ్చినట్టుగా చేసిన నటన నేచురల్ గా ఉంది. కథలో వేగం పడిపోతోందన్న తరుణంలో ముమైత్ ఖాన్ వచ్చి 'నా పేరే కన్యాకుమారి' అంటూ పాడే పాట ప్రేక్షకులకు కిక్ ఇస్తుంది. బ్రహ్మానందం పాత్ర కు కొన్ని థియేటర్లలో కత్తెరవేటు పడింది.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|