'గణేష్' ఆటాపాటా
రామ్ కథానాయకుడిగా శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ నిర్మిస్తున్న 'గణేష్' చిత్రంలో 'లంబోదర అంబాసుత' అనే పల్లవితో సాగే పాటను హైదరాబాద్ లోని శ్రీ సారథీ స్టూడియోస్ వేసిన సెట్లో తీస్తున్నారు. ఈ సందర్భంగా లొకేషన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిర్మాత రవికిషోర్ మాట్లాడుతూ మా బేనర్ లో తీస్తున్న 30వ చిత్రమిదన్నారు. చిల్డ్రన్ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిదని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా సెప్టెంబర్ 23 లేదా 24న విడుదల చేస్తామని తెలిపారు. మాటల రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ 'సమిష్టి కృషితో ఈ సినిమాను చేస్తున్నాం. పాటలు కూడా చాలాబాగా వచ్చాయి. మిక్కీ జె.మేయర్ కు కమర్షియల్ గా ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెడుతుందన్నారు. ఇందులో ఫాస్ట్ బీట్ తో పాటు మెలోడీ సాంగ్స్ కూడా ఉన్నాయని' పేర్కొన్నారు. 'ఈ బేనర్ లో పాటలు రాయడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. క్లైమాక్స్ లో వచ్చే గణేష్ పాటను రాయడం అదృష్టంగా భావిస్తున్నాని 'రామజోగయ్య శాస్త్రి వెల్లడించారు. ఈ చిత్రానికి హరి అనుమోలు, పేకేటి రంగా, శ్రీకరప్రసాద్ తదితరులు తెర వెనుక సాంకేతిక వర్గం.
Be first to comment on this News / Article!
|