మనోజ్ కుమార్ 'బిందాస్'
మంచు మనోజ్ కుమార్ కథా నాయకుడిగా ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సుంకర రామసుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న చిత్రానికి 'బిందాస్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెటంర్లో ఈ లోగో ఆవిష్కరణ జరిగింది. తొంభై శాతం పూర్తి చేసుకున్న బిందాస్ చిత్రానికి నందమూరి బాలకృష్ణ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఈ చిత్రం విజయం సాధించి హీరో, దర్శకులతో పాటు యూనిట్ అంతటికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సినిమా టైటిల్ ఆకట్టుకునే విధంగా ఉందన్నారు. పలు విజయవంతమైన చిత్రాలను అందించిన వీరుపోట్ల ఈ చిత్రానికి దర్శకుడయ్యారు. హీరో మనోజ్ కుమార్ మాట్లాడుతూ 'అన్నయ్య బాలకృష్ణ నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగిందన్నారు'. ఈకార్యక్రమంలో షీనా, వీరుపోట్ల, సుంకర రామబ్రహ్మం, నటుడు కాశీవిశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|